బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యల పై డాక్టర్ మల్లు రవి  తీవ్రంగా మండిపడ్డాడు

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యల పై డాక్టర్ మల్లు రవి  తీవ్రంగా మండిపడ్డాడు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  ఎమ్మెల్యే మర్రి తెలకపల్లి మండలం బొప్పెల్లి గ్రామంలో పబ్లిక్ మీటింగ్లో కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చిపడేస్తాం అనే అహంకారపూరితమైన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. మనము ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం మరి జనార్దన్ రెడ్డికి తగదు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేక నియంత ప్రభుత్వంలో ఉన్నామా ఇంకా ఎన్నికలే మొదలు కాలేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓటమి భయంతో అసహనంలో ఉన్నారు రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోతుందని నేపంతో అసహనంతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టిన సహనంతో ఉండాల్సిందిగా కోరుతున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు సహనం తో ఉండాలని కోరుతున్నాను..