కోరుట్లలో అక్రమ కట్టడాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడి

కోరుట్లలో అక్రమ కట్టడాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడి

ముద్ర, కోరుట్ల:కోరుట్ల పట్టణంలో అనుమతికి విరుద్ధంగా నిర్మించిన మరియు అనుమతి లేకుండా నిర్మించిన నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లీడర్ & రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళ వారం అక్రమ కట్టడాలను టీమ్ సభ్యులు తొలగించారు.

ఇందులో భాగంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉత్తరం దిక్కున నాళాను ఆక్రమించిన నిర్మాణంను, 22వ వార్డ్ లో రోడ్ పై నిర్మించిన ర్యాంప్ ను మరియు సాయి బాబా టెంపుల్ వెనక రహదారి లో నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించడం జరిగినది. అలాగే హై కోర్ట్ గారి ఆదేశాల మేరకు జవహర్ రోడ్ లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన చౌహాన్ లలిత నిర్మాణం పై తగు చర్యలు తీసుకొని తొలగించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ టిపిఓ ఎ. ప్రవీణ్, టిపిఎస్ రమ్య, ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ సభ్యులు రెవెన్యూ శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, ఆర్ & బి శాఖ అధికారులు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.