ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే...

ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే...

ఆత్మకూరు( ఎం )ముద్ర  న్యూస్ : ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి నైజాం నిరంకుశ రజాకార్ల ఆగడాలను ఎదిరించి పోరాడిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కడవరకు పోరాడిన వీరనారి అని అన్నారు.

Also Read: హైదరాబాద్​లో మరో భారీ షాపింగ్​ మాల్​

 కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, స్థానిక సర్పంచ్ జన్నాయి కోడె నగేష్, ఎంపిటిసి యాస కవితా ఇంద్రారెడ్డి, ఆదర్శ రజక సంఘం అధ్యక్షులు వెల్మకన్నె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పైల ప్రశాంత్, రజక సంఘం మాజీ ఆధ్యక్షుడు ఎలిమినేట్ బుచ్చయ్య, గౌరవ సలహాదారుడు ఎలిమినేటి జాంగిర్, విగ్రహ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎలిమినేట్ నగేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోతగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.