ఆర్ఐ పై తహసీల్దార్ కార్యాలయంలో దాడి

ఆర్ఐ పై తహసీల్దార్ కార్యాలయంలో దాడి
  • అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న ఫలితం
  • అంతుచూస్తానని బెదిరింపులు
  • ఆందోళనలో రెవెన్యూ ఉద్యోగులు
  • సెలవుపై వెల్లిన ఉద్యోగి..?

చిగురుమామిడి, ముద్ర న్యూస్: అయనో రెవెన్యూ ఉద్యోగి,తహసీల్దారు కార్యలయంలో ఎప్పటిలాగే మంగళవారం తన విధులను  నిర్వర్తిస్తున్నాడు.అంతలోనే పక్కనుండి నువ్వేనారా నాటిప్పర్లను పట్టుకుంది..నీవు భయటకు అయితే రా నీఅంతు చూస్తా అన్న మాటాలు అతని చెవిన‌ పడ్డాయి.తనను కాదేమో నని తన పనులు తాను చేసుకొని పోతున్నాడు. అంతలోనే మరోసారి అరేయ్ నేను నిన్ను చంపేస్తా నీతోని అయ్యేదేముందిరా అని మరోసారి బెదిరింపులు. దీనితో తననేమో అనుకొని తిప్పి చూడగా ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి కోపంతో రగిలిపోతూ కనిపించాడు. నన్నేనా అని అడిగేలోపే గల్లా పట్టుకొని గదమాయించాడు. ఈ సంఘటన స్వయంగా కరీంనగర్ జిల్లా,చిగురుమామిడి మండల తహసిల్దార్ కార్యాలయంలో అదికూడా తహసిల్దార్ ఇతర ఉద్యోగులు ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

బాధితుడు ఆర్ఐ పూదరి రాజు కథనం ప్రకారం మూడు రోజుల క్రితం చిగురుమామిడి సుందరగిరి శివారు మధ్య కొందరు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం మేరకు తాసిల్దార్  ఆదేశాలతో పూదరి రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే  మట్టి లోడ్ తో టిప్పర్ కనిపించింది. అక్కడే ఉన్న మరో మూడు టిప్పర్లతోపాటు, జెసిబినీ సీజ్ చేసి పోలీసులతోపాటు తహసిల్దారుకు సమాచారం చేరవేశాడు. దీనికి అధికారులు 11,500 జరిమానా విధించినట్లు సమాచారం. మంగళవారం ఎప్పటిలాగే ఆర్ఐ రాజు తన కార్యాలయానికి రాగా అప్పటికే కార్యాలయంలో ఉన్న కోహెడ మండలం, తీగల గుంట్టపల్లె గ్రామానికి చెందిన రాగుల తిరుపతి ఆర్ఐని బూతులు తిడుతూ... గల్లా పట్టి దాడి చేయబోయాడు. ఇదే విషయాన్ని బాధితుడు రాజు అక్కడే ఉన్న తహసిల్దార్ తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. బాధితుడు తనకు న్యాయం జరిగే వరకూ విధులకు హాజరు కాబోనని సెలవు పెట్టి వెళ్లినట్టు సమాచారం.