ఎండపల్లి మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర...  

ఎండపల్లి మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర...  

వెల్గటూర్, ముద్ర: ఎండపల్లి మండలంలోని సూరారం, కొత్తపేట గ్రామాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమాన్ని  నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఆయా గ్రామలల్లో పర్యటిస్తున్న మంత్రి ఈశ్వర్ కు మహిళలు బతుకమ్మలు, కొళాటాలు మంగళ హారతులతో స్వాగతం పలుకారు. కాగా  మండలం లోని సూరారం లో నూతనం గా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఈశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి 50 సంవత్స రాలు అధికారంలో కొనసాగింది తప్ప, ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చి అఢ్డ గోలు హామీలు ఇస్తూ మోస గించడమే వారి లక్ష్యమని  పేర్కొన్నారు. 

గత పాలకులు షూరిటీ ఉన్న వారికే ప్రభుత్వ రుణాలను అందించే వారని,  అందరికీ అందించే వారు  కాదని,  ముఖ్యమంత్రి కేసీఆర్  ఎలాంటి షరతులు లేకుండానే అర్హులందరికి రుణాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఎవరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటే ఆరంగంలో అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ ఎస్ కు అండగా ఉంటారనె ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళితబందు లాంటి పథకాలను చిత్త శుద్ధితో అమలు చేస్తున్నారని, దీని ద్వారా రాష్ట్రంలో 40 వేల మంది దళితుల జీవితాల్లో వెలుగులు నిందుకున్నాయని చెప్పారు.


 
ఇప్పటికే  ఒక్కో నియోజక వర్గానికి  రూ.110 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.  మరో వైపు ఇళ్లు లేని వారి కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. రైతులకు సరిపడినంత విద్యుత్ ను అందిస్తూ, రకరకాల పెన్షన్లు ఇచ్చి, రహదారులు వేసి, మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.  

గణేష్ మండపాల వద్ద మంత్రి పూజలు :  
ఎండపల్లి మండ లంలోని కొత్తపేట గ్రామంలో శ్రీ, శివ పుత్ర  గణేష్ భక్త మండలి, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రత్యేక పూజలు చేశారు. 

అభివృద్ధి పనులకు భూమి పూజ:  
మండలంలోని కొత్తపేట గ్రామంలో మేదరి సంఘం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, వెల్గటూర్ మాజి మార్కెట్ కమిటీ చైర్మన్  ఏలేటి కృష్ణారెడ్డి, వెల్గటూర్ మండల AMC డైరెక్టర్ శ్రీ,జీరెడ్డి మహేందర్ రెడ్డి నాయకులు కూనమల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.