ఫేక్ డాక్యుమెంట్లు తయారీదారుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన సీఐ లక్ష్మీనారాయణ.

ఫేక్ డాక్యుమెంట్లు తయారీదారుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన సీఐ లక్ష్మీనారాయణ.

మెట్‌పల్లి ముద్ర:- విద్యకోసం విదేశాలకు పంపేందుకు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీ ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కట్ట మనోజ్ (28) అధిక సంపాదనకు ఆశపడి విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఇక్కడ విద్యను పూర్తి చేయకపోయినా. విదేశాలకు పంపేందుకు విద్యను పూర్తి చేసినట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విదేశాలకు పంపుతున్నాడని.

ఇది వరకే ముగ్గురిని పంపగా వారు విదేశాల్లో ఉన్నారు ఈ క్రమంలో మెట్‌పల్లి పట్టణంలోని కళానగర్ కు చెందిన బండ గణేష్ అనే వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మనోజ్ ను సంప్రదించగా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ సృష్టించి విదేశాలకు పంపెందుకు వీసా కోసం అప్లై చేయగా రిజెక్ట్ కావడంతో గణేష్ పోలీసులను ఆశ్రయించాడు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మనోజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మనోజ్ కు సహకరిస్తున్న హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతం కు చెందిన లక్ష్మన్ పరారీలో ఉన్నట్లు సీ ఐ తెలిపారు. ఆయన వెంట ఎస్ ఐ శ్యామ్ రాజ్ ఉన్నారు.