భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి

భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి

మధిర, ముద్ర: కుటుంబ గొడవలు ఇద్దరు చిన్నారులను బలికొన్నాయి. భార్యపై కోపంతో పిల్లలను తండ్రి కడతేర్చిన సంఘటన సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర మండలం  రాయపట్నం గ్రామంలో వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...  గ్రామంలోని  ఎస్సీ కాలనీకి చెందిన  పార్శపు  శివరాం గోపాల్ , భార్య ఆరోగ్య లకు మూడో తరగతి చదువుతున్న రామకృష్ణ(8), ఒకటో తరగతి చదువుతున్న ఆరాధ్య (6) ఉన్నారు. పిల్లలు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం సాయంత్రం ఆమె ఇంటికి రాగ ఇద్దరు  పిల్లలు నిర్జీవంగా పడి ఉన్నారు. చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తండ్రే హత్య చేసి పరారైనట్లు అనుమానించారు. భార్య ఆరోగ్య ఇంట్లో లేని సమయంలో సోమవారం సాయంత్రం 4:30 నిమిషాలకు పిల్లలను స్కూలు నుండి శివరాం తీసుకొచ్చాడు. వారిని గొంతు నులిమి చంపి దుప్పట్లో మూటకట్టి పరారైనట్లు భావిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తము మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివరాం పై బైక్,సెల్ ఫోన్ దొంగతనం, ఓ లారీ డ్రైవర్ వద్ద 35 వేలు దొంగతనం చేసిన కేసులు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. భార్యపై అనుమానంతోనే పిల్లలను హత్య చేసినట్టు భావిస్తున్నారు.