విషాద ఘటన - కొత్త బట్టలు కొనట్లేదని పిల్లలను చంపి తల్లి ఆత్మ‌హ‌త్య‌...

విషాద ఘటన - కొత్త బట్టలు కొనట్లేదని పిల్లలను చంపి తల్లి ఆత్మ‌హ‌త్య‌...

ముద్ర, నాగర్ కర్నూల్:- సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్తను పండగకు భార్య కొత్త బట్టలు కొనివ్వాలని కోరింది. జీతం డబ్బులు రాలేదని.. అయినా కొనిస్తానని భర్త చెప్పగా.. ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య మనస్థాపానికి గురై తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పెంటలో జరిగింది.