మెరిట్ లిస్ట్ లేకుండా - సెలక్షన్ ఎలా చేస్తారు.?

మెరిట్ లిస్ట్ లేకుండా - సెలక్షన్ ఎలా చేస్తారు.?
  • పారదర్శకంగా నూతన నియామకాలు చేపట్టాలి - బిఎస్పీ డిమాండ్.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ను కలిసి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098(111) భర్తీల అవక తవకాల గురించి వినతి పత్రం అందజేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన విడుదల చేసిన చైల్డ్ లైన్ ఔట్సోర్సింగ్ 8 ఉద్యోగాలకు గాను దాదాపుగా 290మంది దరఖాస్తు చేసుకోగా, 24నుంచి30 మందిని మెరిట్ వైస్ గా సెలెక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 8 మందిని ఫైనల్ చేయవలసి ఉన్నది. 

ఈ ప్రక్రియ జూన్ 30 తారీఖు నాడు జరిగినది. ఇంటర్వ్యూ తప్ప మొత్తం ప్రక్రియ వాట్స్ ప్ గ్రూప్ లో జరగడం గమనార్హం. దీనివల్ల అర్హత అనుభవం ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏ మాత్రం అనుభవం లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బాలబాలికల జీవితాలకు ముడిపడిన ఈ ఉద్యోగాలు అనర్హత ఉన్నవారికి ఇవ్వడం వల్ల చైల్డ్ లైన్ పనితీరు నీరుగారే అవకాశం ఉంది. గతంలో DCPO నియామకాలో ఇలాగే అవక తవకాలు జరిగాయాని అభ్యర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సఖి కేంద్రంలో గతంలో బాలిక కూడా ఆత్మహత్య కూడా చేసుకుంది ఇదంతా వీరి అసమర్థకు నిదర్శనం. ప్రస్తుత నియామకాల్లో ఒకే ఇంట్లో ఇద్దరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ ప్రశ్నించారు. ఈ చైల్డ్ లైన్ నియామకాలు ఇలాగే అవకతవకలతో కొనసాగితే భవిష్యత్తులో రాబోయే సఖి సెంటర్ డిడబ్ల్యుఓ ఓల్డ్ ఏజ్ హోమ్ తదితర అన్ని ఉద్యోగాలను అర్హత కలిగిన వారికి కాకుండా అనర్హత డబ్బు పలుకుబడి ఉన్నవారికి కట్టబెట్టే అవకాశం ఉంటుంది. కావున దీనిపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి DWO మరియు కమిటీ సభ్యులను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేయడం జరిగింది. నిరుద్యోగులకు న్యాయం చేసి ప్రస్తుత నియామకాలు రద్దు చేసి తిరిగి పారదర్శకంగా నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శక నియామకాలు చేపట్టాలని సోమవారం రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, ఉద్యోగ అభ్యర్తులు పాల్గొన్నారు.