మార్కండేయ లిఫ్ట్ పంపు హౌస్ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

మార్కండేయ లిఫ్ట్ పంపు హౌస్ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
  • పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను, సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ను ఆదేశించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బిజినపల్లి మండలంలోని గంగారం,సాయిన్ పల్లి,మమ్మాయి పల్లి,లట్టుపల్లి,17 గిరిజన తాండల కలల ప్రాజెక్టు సుమారు 8000 ఎకరాలకు సాగునీరు అందించే మార్కండేయ లిఫ్ట్ నిర్మాణం పనులను ఈరోజు సాయిన్ పల్లి గ్రామం దగ్గర పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ,ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఇరిగేషన్ అధికారులతో పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు,పంప్ హౌస్ నిర్మాణం,విద్యుత్ సబ్ స్టేషన్,యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ను,ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,రిజర్వాయర్ చుట్టూ నిర్మించే బండ్ పనులు 90% అయినవి అని, గ్రావిటీ కెనాల్ పనులు 500 మీటర్లు పూర్తి అయ్యింది అని అధికారులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఎనమిది వేల ఎకరాలకు సాగునీరు ,ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని తెలిపారు,ఈ లిఫ్ట్ నిర్మాణంతో బిజినపల్లి మండలం మొత్తం పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.