హక్కు లేని ఆ నేత గ్రామాలకు వస్తే చెప్పుతో కొట్టాలి - కూచుకుళ్లా రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  ఒకవైపు ప్రజలను మోసం చేస్తూనే మరోవైపు దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో ఓటు అడిగే హక్కు లేదని ఓటు అడిగేందుకు గ్రామాలకు వస్తే చెప్పుతో సమాధానం చెప్పాలని కూచుకుళ్లా రాజేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను దళితుల భూములను స్వాధీనం చేసుకొని వారికి పరిహారం చెల్లించడంలో మోసం చేయడంతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చారా అని ఆయన నాయకులను ప్రశ్నించారు అదేవిధంగా ఆరు నెలల లోపు మండల పరిధిలోని భక్త మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే రాబోయే ఎన్నికలలో ఓటు అడగనని స్వయంగా ఎమ్మెల్యేనే పేర్కొనడం జరిగిందని మరి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఎన్నికలలో ఎలా ఓట్లు అడుగుతారని రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు దళితులను బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తన తండ్రి దామోదర్ రెడ్డి సౌమ్యుడని కానీ మా కార్యకర్తల జోలికి వస్తే తరిమి కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గుర్తుంచుకోవాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. కార్యకర్తలు నాయకులు ఎవరు ఎమ్మెల్యే చేసే భయం బ్రాంతులకు గురి కావద్దని కాంగ్రెస్ జెండా అండగా ఉంటుందని తాను మీకోసం మనకోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు