ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేనందుకు ఎమ్మెల్యే చిందులు

ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేనందుకు ఎమ్మెల్యే చిందులు
: :

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : అచ్చంపేట బల్మూరు మండలం జిన్ కుంట గ్రామంలో ఈనెల 25వ తేదీనా హనుమాన్ టెంపుల్ లో ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది..గ్రామ పెద్దలంతా రాజకీయాలకతీతంగా అందరూ కలిసికట్టుగా గుడి కార్యక్రమం చేసుకోవాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కూడా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేసుకోవడం జరిగింది..అయినను కూడా కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది..అయిన కూడా గ్రామస్తులు ఎవరిని ఏమనలేదు..కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది..అయితే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జిన్ కుంట కాంగ్రెస్ డిప్యూటీ సర్పంచ్ కృష్ణయ్య కు ఫోన్ చేసి నా ఫోటో ఎందుకు పెట్టలేదు, మీ అంతు చూస్తా, మీది ఊర్లో ఎక్కువైంది అని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు డిప్యూటీ సర్పంచ్ కృష్ణయ్య, మరియు గ్రామస్తులు..