కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా ప్రజారాధన చూసి ఓర్వలేక పోతున్న ఎమ్మెల్యే గువ్వల

కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా ప్రజారాధన చూసి ఓర్వలేక పోతున్న ఎమ్మెల్యే గువ్వల
  • ఉప్పు నూతల మండల కాంగ్రెస్ పార్టీ నేతలు

ముద్ర, అచ్చంపేట:-అచ్చంపేట నియోజకవర్గ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓర్వలేక పొతున్నారు అని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు.శనివారం ఉప్పునుంతల మండల కేద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.....

శుక్రవారం  స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు  ప్రెస్ మీట్ పెట్టి ప్రశాంతంగా ఉన్న  మండలలలో రాజకీయ ప్రచారం చేస్తునప్పటికి
ఏలాంటి గొడవలు జరగకున్న అచ్చంపేట నియోజకవర్గం లో రాబోయే ఎన్నికలలో ఓటమి భయ్యంతో మతిస్థిమితం కోల్పోయి ప్రశాంతంగా ఉన్న నల్లమల ప్రాంతంలో పలు గ్రామాలలో పార్టీల మధ్య చిచ్చు పెట్టి గొడవలకు దారితీసి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దసరా పండగ సందర్బంగా ఉప్పునుంతల మండలం లోని పెనిమిళ్ల, పెద్దాపురు గ్రామాలలో బతుకమ్మ పండుగ  కులాలకూ, మతాలకు రాజకీయ పార్టీ లకు అతితంగా జరుపుకునే పండుగలలో కూడా రాజకీయం చేస్తూ గొడవలకు దారి తీస్తున్నారని ఆరోపించారు.మొన్న దేవదారి కుంటలో ఎందుకు దిష్టి బొమ్మ దహనం చెయ్యవలసిన అవసరం ఎముందాని ప్రజలు నిలదీశారాను అన్నారు.మా నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవ్వరిపైన దూర్సుగా పవర్తించారా ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కాబట్టి ఎన్ని హింసలకు  గురిచేసిన గాంధీయా మార్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నడుస్తారని అన్నారు.  అదేవిధంగా రైతుబంధు గురించి మా నాయకుడు రేవంత్ రెడ్డి  కూడా చెప్పాడు నవంబర్ 2 లోపు పెట్టుబడి సాయం రైతు లకు ఇయ్యమని అడిగారని అన్నారు. దానిగురించి కూడా ఎమ్మెల్యే  పెద్ద రాదంతం చేస్తుండు.

ఏది ఏమైనా ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో ఓటమి భయ్యంతో  గువ్వల బాలరాజు అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు.  ప్రజలారా మీరు ఒక్కటే ఆలోచన చెయ్యాలి  అచ్చంపేట నియోజకవర్గం లో జరుగుతున్నా ఎన్నికలు ధర్మాన్నికి మరియు అధర్మానికినీతికి మరియు అవినీతికి మద్యన జరుగుతున్నా ఎన్నికల్లో స్థానిక తకు నల్లమల ముద్దు బిడ్డ డాక్టర్ వంశీకృష్ణ ఓటు వేసి మన ప్రాంతాని అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి , జడ్పిటిసి ప్రతాపరెడ్డి , వైస్ ఎంపిపి వెంకటేష్, విజేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాందాసు, జైపాల్, రథంసింగ్, రామచంద్రo,
యువజన  విభాగం మండల ఇంచార్జి శేఖర్ గౌడ్, గుద్దటి బాలరాజు ,నాగరాజు, అశోక్, కుర్మయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.