రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో రెవిన్యూ ఉద్యోగాలు ముందుండాలి...

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో రెవిన్యూ ఉద్యోగాలు ముందుండాలి...
  • రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముద్ర నాగర్ కర్నూలు జిల్లా : కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్ కే సీతారామారావులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ....

ప్రతి రెవిన్యూ ఉద్యోగి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో రెవిన్యూ ఉద్యోగులు ముందుండాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఐదు గ్యారెంటీ ల దరఖాస్తుల ఆన్లైన్ నమోదులో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.ఉద్యోగులకు, అధికారులకు అవసరమైన మంచి సమాచారంలో డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు.

రెవిన్యూ ఉద్యోగస్తులకు కలెక్టర్ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ....గ్రామీణ స్థాయిలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పరంగా సేవలు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగస్తులు పునరంకితమౌతూ రెవెన్యూ శాఖను పూర్వ వైభవంగా రెవిన్యూ సిబ్బంది పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డిఓ నాగరాజ్, జిల్లా అధ్యక్షుడు యం. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వెంకటరమణ, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాజమైనుద్దీన్, జిల్లా కోశాధికారి కరుణాకర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, తబిత రాణి, కార్తీక్ కుమార్, శ్రీనివాసులు, ఇబ్రహీం, సైదులు తహసిల్దార్లు జాకీర్ అలీ, డిప్యూటీ తాసిల్దార్లు ఖాజమైనదిన్ రఘు రెవిన్యూ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.