కేంద్రంతో కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్..

కేంద్రంతో కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్..

వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పై అంబరాన్నంటిన రైతన్నల సంబరాలు..: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: కుట్రలను ఛేదించి కేసులను అధిగమించి కేంద్రంతో కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి కృష్ణాజలాలతో అభిషేకం చేసిన రైతులు.. పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి  తెరాస రాష్ట్ర నాయకులు బైకనీ శ్రీనివాస్ యాదవ్  హాజరైనారు... ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ రైతులకు సుమారు 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాయకులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా అడ్డుకున్నారని, రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఎలాగైనా రైతులకు సాగునీరు అందించాలని న్యాయపోరాటం చేసి ఈరోజు కుట్రలను తిప్పి కొట్టి కేసులను అధిగమించి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు, రైతులు స్వచ్ఛందంగా విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వట్టెం రిజర్వాయర్ ఆనకట్టపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి కృష్ణా జలాలతో అభిషేకం నిర్వహించడం సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపడం చాలా శుభ పరిణామం అని అన్నారు.

 గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 14 ఏళ్లు పనులు చేయకుండా కేవలం కాలువలు మాత్రమే తవ్వి ఎన్నికల్లో ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి కపట ప్రేమ చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు సీఎం కేసీఆర్  సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్లు 14 ఏళ్లు పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టుని కేవలం రెండేళ్లలో పూర్తి చేసి నాగర్కర్నూల్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నందున మళ్లీ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఇంకో 50 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తే మాకు పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కేసులు వేయడం చాలా దురదృష్టకరమైన అన్నారు వారు రైతుల ఉసురు తగిలి పోతారని కూడా అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ వంటి పథకాలతో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతులకు ఎంతో వెన్నుదన్నుగా ఉండి రైతులను తన కాళ్లపై తాను నిలబడేలా చేసిన ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  అన్నారు.

సీఎం కేసీఆర్  ఆశీర్వాదంతో వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కూతవేటు దూరంలో శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్ అని పేరు పెట్టి సుమారు 17 టీఎంసీల నీళ్లు నిలువ చేసే రిజర్వాయర్ నాగర్కర్నూల్ నియోజకవర్గంలో తిమ్మాజిపేట మండలం బిజినపల్లి మండలం కి సాగునీరు అందించే విధంగా సుమారు నాలుగువేల కోట్లతో వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు, ఈ వట్టెం రిజర్వాయర్ పనులు ప్రారంభించే తరుణంలో కూడా రైతులను రెచ్చగొట్టి ఆనకట్ట పనులు పూర్తి కాకుండా హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసి పబ్బం గడిపిన కాంగ్రెస్ పార్టీకి రైతులపై ప్రేమ అనేది సమితి తల్లి ప్రేమ అని అన్నారు, అలాంటి కాంగ్రెస్ పార్టీని రైతులు బొంద పెడతారు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో బిజినపల్లి మండలంలో సుమారు 17 తండాలకు ఐదు గ్రామపంచాయతీలకు సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 100 కోట్లతో ఇంకో ప్రాజెక్ట్ మార్కండేయ లిఫ్టును తీసుకురావడం జరిగిందని తెలిపారు అతి త్వరలో మార్కండేయలిఫ్టు పనులు పూర్తిచేసి 8000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని తెలిపారు, ప్రభుత్వం ద్వారానే కాకుండా తన సొంత ట్రస్టు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను అని తెలిపారు.

 రాబోయే రోజుల్లో మా ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోని రైతులకు 50% సబ్సిడీ కింద వ్యవసాయ పనిముట్లు కూడా అందజేస్తామని తెలిపారు దానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని త్వరలో విధివిధానాల ప్రకటించి 50 శాతం సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందజేస్తామని తెలిపారు, నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుడు ఉండొద్దని ఉద్దేశంతో ఎంజాయ్ టెస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరం ఏర్పాటు చేసి సుమారు 15000 మంది యువతీ యువకులకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు ఆ ప్రక్రియ మొదలైంది అన్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న తనపై ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని జీవితకాలం శత్రువులు ఒకటైతున్నారని అన్నారు నాగర్ కర్నూల్ ప్రజల బలం ఉన్నంతవరకు తనను ఎవరూ ఏం చేయలేరని పేర్కొన్నారు, గత 50 ఏళ్లుగా రైతులను అరిగోశలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే రైతులే బుద్ధి చెప్తారని తెలిపారు, గతంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టులో కేసులు వేసినా కూడా న్యాయపోరాటం చేసి కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నారని అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేసి దసరా లోపు వట్టెం రిజర్వాయర్ లో నీళ్లు నింపుతామని తెలిపారు, ఇప్పటికే నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లో నిర్మాణం పూర్తయిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.