అసమర్థ ముఖ్యమంత్రిని గద్దె దించాలి          

అసమర్థ ముఖ్యమంత్రిని గద్దె దించాలి          
  • హామీల అమలుకు కాంగ్రెస్ ను గెలిపించాలి        
  •  కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి             

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: గత రెండు శాసనసభ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాబోయే ఎన్నికలలో తరిమికొట్టి హామీలను అమలు చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ యువ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి కోరారు సోమవారం పార్టీ పిలుపుమేరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలంలో జెండాను ఆవిష్కరించారు అనంతరం పాదయాత్ర నిర్వహిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గాంధీ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించిన విధంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సారధ్యంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని అహింసాహిత ఉద్యమాలలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన పోరాటం ఎంతో విరోచితం అని అన్నారు. గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని రాబోయే రోజులలో అసమర్థ ముఖ్యమంత్రిని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ఉద్యమ మరియు ఎన్నికల సమయంలో దళిత ముఖ్యమంత్రి వ్యవసాయ భూ పంపిణీ రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు కేజీ టు పీజీ ఉచిత విద్య ఉద్యోగ అవకాశాల కల్పన నిరుద్యోగ భృతి రైతు రుణమాఫీ లాంటి అనేక పథకాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లి గెద్దెనెక్కిన తర్వాత వీటి అమలు చేయడం లేదని ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు గ్రామాలకు వచ్చే అధికార పార్టీ నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన హామీలను అమలు చేసిన సంగతి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వివిధ డిక్లరేషన్ లను పూర్తిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాబోయే ఎన్నికలలో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విదేశాలలో విద్యను అభ్యసించిన మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు ఇక్కడికి రావడంతో పాటు బ్రిటిష్ పాలకులను  తరిమికొట్టడంలో అహింసా మార్గంలో అనేక పోరాటాలు నిర్వహించి ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలతో దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అబ్జర్వర్ రాజ్ దీప్ మరియు సునీత  dcc మహిళా  అధ్యక్షురాలు రోహిణి రెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్య గౌడ్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట పాండు,నాగర్ కర్నూల్ మండల పార్టీ అధ్యక్షుడు కోటయ్య, తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు ఐతోల్ లక్ష్మయ్య, తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్ రావు, బిజినపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మిద్దె రాములు, తిమ్మాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జడ్పిటిసి సుమిత్ర దేవి,కౌన్సిలర్స్ ఎండీ నిజాముద్దీన్ సుల్తాన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...