టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో  గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో నిరసన

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో  గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో నిరసన

ముద్ర ప్రతినిధి భువనగిరి :ఐ జే యు దేశవ్యాప్త జర్నలిస్టుల సత్యాగ్రహ నిరసన కార్యక్రమం పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా  శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఆవరణంలో గల మహాత్ముని గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి కే నరసింహ చారి, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ వెలిమినేటి జహంగీర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు.

దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని ఏర్పాటు, మీడియా కమిషన్ ఏర్పాటు చేసి, జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాసులు పునరుద్ధరించాలి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి అందజేశారు. జర్నలిస్టు కుటుంబాలకు  ఆర్థిక సహాయం రూ.పది లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ 50 లక్షల బీమా పథకం వర్తింపజేయాలన్నారు. కార్పొరేటర్ ఆస్పత్రులలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ఎత్తివేసి జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం ద్వారా ఆర్థిక సహాయాన్ని మొత్తం అందజేయాలన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే మల్లేష్, పట్టణ అధ్యక్షులు మరికొండ మల్లేష్, పాశం నవీన్ కుమార్, నాయకులు, జర్నలిస్టులు ఎండి ఇబ్రహీం, తాళ్ల భాస్కర్ చకిలం సురేందర్రావు, సతీష్ , నరసింహ చారి, ఎండి సమ్మి ఆఫ్టర్, ఫరూక్, రాజు, మహేష్ ,సిరిల్ పాల్గొన్నారు.