గురుకుల విద్యార్థినికి కుక్కకాటు

గురుకుల విద్యార్థినికి కుక్కకాటు
  • గుట్టుచప్పుడు కాకుండా  ఆస్పత్రిలో చికిత్స
  • జిల్లా బంజారా అధ్యక్షుల ఆధ్వర్యంలో సందర్శన  

ముద్ర,ఎల్లారెడ్డిపేట :ఏకలవ్య గురుకుల విద్యార్థినికి కుక్క కరిచిన సంఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో  నిన్నటి రోజు ఆరవ తరగతి చదువుతున్న రాజన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థినికి కుక్క కరవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినికి ఎల్లారెడ్డిపేటలోని  ఆసుపత్రికి అదేవిధంగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి కి తీసుకువెళ్లి  ఇంజక్షన్ చేయించి తల్లిదండ్రులకు గురుకుల ప్రిన్సిపల్ రామారావు  అప్పజెప్పారు.సుమారు 450 మంది విద్యార్థులు హాస్టల్లో చదువుకుంటున్నారు.  హాస్టల్లో మూడు కుక్కలను పెంచుతున్నట్లు తెలిసింది.  విద్యార్థినికి కుక్క కరవడం పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

విద్యాసంస్థల్లో పెంపుడు జంతువులను పెంచద్దని నియమా నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కి కుక్కలను పెంచడం మూలాన విద్యార్థులను కాటు వేయడంతో విద్యార్థులు భయాందోళనలో  పడ్డారు. ముద్ర ప్రిన్సిపల్ రామారావును వివరణ కోరగా కుక్క కాటు వేసింది నిజమేనని  కానీ ప్రమాదం ఏమీ లేదని  వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించి  వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందని ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే అని అన్నారు.సమాచారం తెలుసుకున్న బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు  అజ్మీర రాజు నాయక్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ సభ్యులు తిరుపతి నాయక్, గోపి నాయక్, గుగులోతు తిరుపతి, ప్రకాష్ నాయక్, మండల ఎస్టీ  అధ్యక్షులు దేవిలాల్ నాయక్,  సర్పంచులు ప్రభు నాయక్, శంకర్ నాయక్, పుణ్య నాయక్, సాయి తదితరులు వెళ్లి గురుకుల పాఠశాలను సందర్శించి జరిగిన ప్రమాదం పట్ల ఆరా తీశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని ప్రిన్సిపాల్ తో  చెప్పారు.