తేమ పేరుతో దోపిడి

తేమ పేరుతో దోపిడి

రైతును నిలువున ముంచుతున్న లక్ష్మీనరసింహ రైస్ మిల్లు

చిట్యాల ముద్ర న్యూస్: చిట్యాల మండలంలోని లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తేమా పేరుతో క్వింటాలకు 9 కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఆరుకాలం కష్టం చేసి పంట పండించి ధాన్యం అకాల వర్షాలకు రైతులు నష్టపోయి, ఉన్న దాన్యం మిల్లులలొ దాన్యం అమ్మేందుకు తీసుకువెళ్తే తేమ పేరుతో రైతులను నిలువునా దోచి వేస్తున్నారు. అలాగే మిల్లు యజమాని రైతులను ధాన్యం ట్రాక్టర్లో మాత్రమే తీసుకురావాలని లేదంటే ధాన్యం తీసుకోమని రైతులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోమని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారని రైతులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నాడు. ఇదేంటి అనే ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే ధాన్యం ఇవ్వండి లేకపోతే ధాన్యం తీసుకవెల్లండి అని దబయిస్తున్నారు. ఒకవైపు జిల్లా యంత్రాంగం తరుగు తీయవద్దని ఆదేశాలు జారీ చేసిన కూడా జిల్లా అధికారుల మాటలు బేకాదారు చేస్తూ ఇష్టం ఉన్నట్లు రైతుల ధాన్యం లో తరుగు పేరుతో దోచుకుంటున్నారు. ఇప్పటికైనా మిల్లు పై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు చేతులెత్తి వేడుకుంటున్నారు.