సిరిసిల్లలో యాంకర్ అనసూయ సందడి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సినీ నటి, జబర్దస్త్ ఫేం యాంకర్ అనసూయ సందడి చేసింది. సిరిసిల్లలో విశాల షాపింగ్ మాల్ సారీ సెంటర్ ను ప్రారంభించింది. విశాల షాపింగ్ మాల్ లో అతి తక్కువ ధరలకు పట్టుచీరలు దొరుకుతున్నాయని అద్భుతమైన డిజైన్లు ఉన్నాయని పేర్కొంది.

షాపింగ్ మాల్ నిర్వాహకులు విష్ణును అభినందించింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జెడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, కౌన్సిలర్ గుండ్ల పెళ్లి తదితరులు పాల్గొన్నారు.