రెవెన్యూ డివిజన్ కావాలని సంతకాల సేకరణ

రెవెన్యూ డివిజన్ కావాలని సంతకాల సేకరణ

ముద్ర, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతూ వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానుల వద్ద నుండి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటూ మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంనకు పంపే లేఖ పై వారు సంతకాలు చేశారు. బుధవారం మొదటి సంతకం రెవెన్యూ డివిజన్ లో బాగంగా సీనియర్ జర్నలిస్టు ఎదురుగట్ల ముత్తయ్య తో ప్రారంబించారు.ఇక ప్రతి గ్రామ గ్రామాన సంతకాల సేకరణ,గ్రామ పంచాయతీ సర్పంచ్ లను, పాలకవర్గాలను రెవెన్యూ డివిజన్ సాధన కోసం గ్రామగ్రామాన తిరిగి మద్దతు కోరుతామని వారు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తా బాద్ నాలుగు మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ గా ఎల్లారెడ్డిపేట ను ప్రకటించాలని కోరుతూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.

సంతకాలు  సేకరించిన పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కెటిఆర్ కు సేకరించిన సంతకాల పత్రాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు సాధన సమితి సభ్యులు తెలిపారు.అతి త్వరలో మంత్రి కెటిఆర్ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని దుకాణదారులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మా రెడ్డి, రఫిక్, చెన్ని బాబు,టిడిపి జిల్లా నాయకులు మాలోత్ సూర్య నాయక్  బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరద వెళ్లి స్వామి,తాటిపెళ్లి అంజయ్య,లింగాల సందీప్, తదితరులు ఉన్నారు.