పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి..

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
  • పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సహపంక్తి  భోజనాలు...
  • ఎస్పీ అఖిల్ మహాజన్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :కరోనా విపత్కర సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు వద్ద ఏ చేససహాపంతి బోజనల్లో 100  మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులకు  సాహపంతి భోజనాలు నిర్వహించారు. ఈ  సందర్బంగా వారి తో కలసి ఎస్పీ అఖిల్ మహాజన్,పోలీస్ అధికారులు భోజనం చేసారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ కరోన విజృంభణ సమయంలో పోలీకేసులు,పారిశుధ్య కార్మికులు,వైద్య సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాలందించారని అన్నారు.పోలీసులు సమాజంలో నేరాలు లేకుండా శుభ్రం చేస్తే, పారిశుధ్య కార్మికులు సమాజంలో చెత్త చెదారం లేకుండా శుభ్రం చేస్తున్నరని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచరి,సిఐ లు అనిల్ కుమార్,ఉపేందర్,వెంకటేష్,ఎస్ఐ లు   మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు..