తెలంగాణ విజయాల్లో ప్రధానపాత్ర విద్యుత్ శాఖదే

తెలంగాణ విజయాల్లో ప్రధానపాత్ర విద్యుత్ శాఖదే
  • నిత్య కోతల నుండి నిరంతర వెలుగులు
  • విద్యుత్ వినియోగం 1550.36 యూనిట్లు నుండి 2729 కు చేరుకుంది

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్:  ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణలో అద్బుతమై పథకాలను ప్రవేశపట్టి విజయాలను సాదించగలిగిందంటే అందులో ప్రధానపాత్ర విద్యుత్ శాఖ పోషించిందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో బాగంగా 3వ రోజు నిర్వహించిన తెలంగాణ విద్యూత్తు విజయోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవతరించి 9వసంతాలను పూర్తిచేసుకోని 10 వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్బంగా ప్రజలకు, ఉద్యొగులకు దశాబ్ది ఉత్సవాల శుభాబివందనాలను తెలియజేశారు. చిన్నతనంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడో పోతుందో తెలియక, రోజులో కోద్దిసమయం మాత్రమే ఉండే కరెంటును చూశామన్నారు. ప్రపంచంలోని అమెరికా లాంటి దేశాలు కరెంటు కోతలు లేకుండా ఉంటాయంటే విని అభూత కల్పనలుగా కోట్టిపారేశాం.

భారతదేశానికి స్వాతంత్యం సిద్ధించిననాటి నుండి సరైన ఆధారణ లేక అన్ని రంగాల్లోను తెలంగాణ వెనకబడిపోయిందని, గ్రామీణ ప్రాంతాలలో కరెంటు సరిగా రాకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ముంబాయి, భీవండి, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయె పరీస్థితులు ఉండెవన్నారు. పవర్ సప్లై కోసం దర్నాలు చేస్తు విద్యుత్ ఉద్యొగులను ధూషించే పరీస్థితులు ఉన్నాయన్నారు. పక్కనే గళగళపారే గోదావరి నీళ్లు, సింగరేణి బోగ్గు నిక్షేపాలు సమృద్దిగా ఉన్న, వాటిని ఇక్కడ వినియోగించకుండా తెలంగాణను గుడ్డి దీపం చేశారన్నారు. కరెoటు ఎక్కువగా వాడే పరిశ్రమల పవర్ హలిడేలను ప్రకటించుకునేవని, వాటిని చూసి కొత్త పరిశ్రమలు కూడా ఇక్కడకు రాకుండా తరలిపోయాయని గుర్తుచేశారు. వ్యవసాయానికి కనీసం 3గంటల కరెంటైనా ఇవ్వకపోవడంతో సాగుచేయలేక బీడుభూములుగా పంటపోలాలు మారేవని. నీళ్లుంటె, కరెంటు ఉండని, కరెంటుంటే నీళ్లుండని పరీస్థితులు, లోఓల్టేజి సమస్యతో ఎండిపోయిన నారు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, కాలిపోయిన మోటార్లతొ రైతులు అరిగోస పడి పండించిన పంటను మొత్తం పశువులకు గ్రాసంగా ఇచ్చే దుర్బర పరీస్థితులను చూశామన్నారు. తెలంగాణలో సరైన నీరు, కరెంటు ను సక్రమంగా వినియోగించబడాలనే సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గళగళా పారె గోదారి నీరు తరలి పోకుండా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మండుటెండల్లో మత్తడులను దూకే చెరువులను సాదించుకున్నామని, పవర్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టడంతో రాష్ట్ర అవతరణకు పూర్వం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే పండించుకోగలిగితె, తరువాత భూమికే బరువయ్యెంత పంటను పండించుకోగలిగామంటే కారణం విద్యూత్ శాఖ అని అన్నారు. 2014 కంటెముందు కరీంనగర్ జిల్లాలో తలసరి విద్యూత్ వినియోగం 1550 యూనిట్లు మాత్రమే ఉంటే, రాష్ట్ర ఆవిర్బావం అనంతరం నేడు 2729 యూనిట్ల తలసరి విద్యుత్ ను వినియోగిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు ఒక్కొరైతుపై నెలకు 15 నుండి 20 వేల వరకు ప్రభుత్వమే ఖర్చుచేస్తుందని, 8 రూపాయలకు కరెంటును కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని అన్నారు. దాదాపు 50వేల కోట్లు రైతులపై ఖర్చుచేయడం జరుగుతుందని, రైతుబందు, రైతుభీమా, ఉచిత కరెంటు వంటి పథకాలను తెలంగాణలో అమలు చేసుకోవడంతో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు. క్వాలిటి ఆఫ్ కరెంట్ ను ఇవ్వడంతో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ఎక్కడా రోడ్డుకు మద్యలో, అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలు, లూస్ వైర్లు, లో ఓల్టెజి సమస్య కనబడడం లేదని తెలిపారు. రెక్కాడితే గాని డోక్కాడని నాయిబ్రాహ్మనులు, రజకులకు ఇబ్బందులు పడకూడదని, 250 యూనిట్లవరకు ఉచిత కరెంటు, 10వేలతో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు ప్రభుత్వమే సహకరిస్తుందని తెలిపారు. ప్రతిశాఖ ద్వారా సబ్సిడిలను అందించి కులవృత్తులను కాపాడుతున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే నాడు 132/33 కె.వి. సబ్ స్టేషన్లు (7), 220 కె.వి సబ్ స్టేషన్ లు (1), 400 కె.వి. సబ్ స్టేషన్లు ఒక్కటి కూడా లేని పరిస్థితులు ఉంటే , రాష్ట్ర ఆవిర్బావం తరువాత (16) 132/33 సబ్ స్టేషన్లు, (4) 220 కె.వి. సబ్ స్టేషన్లు , (2) 400 కె.వి. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో నిర్విరామంగా ముందుకు సాగుతోందంటే ఆందులో ప్రదాన పాత్ర విద్యుత్ శాఖకే దక్కుతుందని, అందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్న కెబుల్ బ్రిడ్జి పనులని అన్నారు. బ్రిడ్జి వద్ద 15రోజుల్లో డైనమిక్ లైటింగ్, లేజర్ లైట్ షో ఇతర నిర్మాణ పనులకు సరిపడా విద్యుత్ అందించేలా ఎర్పాటు చేశారని కోనియాడారు.

సర్వమతాలు కలసి దశాబ్ది వేడుకలను అద్బుతంగా నిర్వహించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.రాష్ట్రం ఏర్పడక ముందు అంతులేని కోతలు పవర్ హాలిడేలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి స్థాయిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచికలో విద్యుత్ వినియోగం ఒకటని అన్నారు. ఆర్థిక వృద్ధిలో విద్యుత్ రంగం తిలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విధి నిర్వహణలో వెలుగులు నింపి అసువులు బాసిన ఎంతోమంది లైన్ మెన్, విద్యుత్ ఉద్యోగులకు మంత్రి ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందంటే నిదర్శనం విద్యుత్ శాఖవల్లనేనని, రాష్ట్రంలో ఎ సంఘటన జరిగిన 24/7 అప్రమత్తమైన సేవలందించే శాఖల్లో విద్యుత్ శాఖ ముందువరుసలో నిలుస్తందన్నారు. వ్యవసాయ పనులకు సబ్సిడిలను ఇస్తూ, సరిపడా విద్యుత్ అందిస్తు తెలంగాణ విద్యుత్ శాఖ దేశంలో తెలంగాణను అగ్రబాగాన నిలిపిందన్నారు. ఈ కార్యక్రమలో మేయర్ వై. సునీల్ రావు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. గంగాధర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, జిల్లా గ్రందాలయ సంస్థ చైర్మన్ పోన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ టి లక్ష్మయ్య, ఆర్డిఓ ఆనంద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, యంపిటిసిలు, కార్పోరేట్లు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.