ఈనెల 10న హుజూర్ నగర్ కోర్టు లో లోక్ అదాలత్

ఈనెల 10న హుజూర్ నగర్ కోర్టు లో లోక్ అదాలత్

సీనియర్ సివిల్ జడ్జ్
జిట్టా శ్యాంసుందర్

హుజూర్ నగర్, ముద్ర:ఈనెల 10న హుజూర్నగర్ కోర్టు ప్రారంభ ప్రాంగణంలో లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జ్ జిట్టా శ్యాంసుందర్ అన్నారు. సోమవారం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షణికవేశంలో గొడవలు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వారికి రాజీ కుదిర్చి కేసును పరిష్కరించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ తీర్పు శాశ్వతంగా ఉంటుందన్నారు. భూ తగాదాలు, మనీ రికవరీ కేసులు, భార్యాభర్తల కేసులు, పెండింగ్ కేసులు, సుమారుగా 8000 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు,అవి మొత్తం హుజూర్నగర్ లోనే పరిష్కారం అవుతాయని అన్నారు. కోర్టులో ఎప్పుడైనా ఒక వ్యక్తికి మాత్రమే తీర్పు వస్తుందదని, కోర్టుకు రావడం వలన టైం వేస్ట్ అవుతుందని ప్రతి మండలంలో పారా లీగల్ వాలంటీర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ మారుతి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సాముల రాంరెడ్డి ,కాల్వ శ్రీనివాసరావు పాల్గొన్నారు.