ష్...అంతా గప్ చుప్...!

ష్...అంతా గప్ చుప్...!
  • మౌనముద్రలో కాంగ్రెస్ సీనియర్లు
  • నో కామెంట్లు నో సెటైర్లు
  • మీ నియోజకవర్గాలు మీరు చూసుకోండి పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే అధిష్టానం సీరియస్
  • నల్లగొండ అంతా నిండిందన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం
  • కొత్తవారిని ప్రోత్సహించకుండా చేరికలను అడ్డుకుంటున్నారని సీనియర్లపై హై కమాండ్ కు ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా మౌనం రాజ్యమేలుతుంది గత కొంతకాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 ఏళ్లుగా ఏలిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు. నల్లగొండ అంతా నిండిపోయింది కొత్తవారు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై చెలరేగినట్లు తెలిసింది కొత్తవారిని పార్టీలోకి రాకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు ఎవరి నియోజకవర్గాలు వారు చూసుకోవాలని పక్క నియోజకవర్గాల్లో వేలు పెడితే వేటు తప్పదనే సంకేతాలు సీనియర్లకు అందినట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతట గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మేరకు ఇటీవల గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో నల్లగొండ జిల్లా విషయమై చర్చించినట్లు సమాచారం

కాంగ్రెస్ సీనియర్లకు కళ్లెం నోటికి గొళ్ళెం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులైన కాంగ్రెస్ సీనియర్లు మాజీ టి పి సి సి అధ్యక్షుడు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి రామిరెడ్డి దామోదర్ రెడ్డిలు గత 30 సంవత్సరాలు పైగా ఉమ్మడి నల్లగొండ జిల్లాను రాజకీయాల్లో శాసించారు అయితే గత కొద్దికాలంగా వీరు చేస్తున్న కామెంట్లు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండడంతో వీరికట్టడికి కాంగ్రెస్ ఐ కామెంట్ కళ్లెం వేయడంతో పాటు అనవసర కామెంట్లు చేయొద్దంటూ నోటికి గొళ్ళెం కూడా వేసినట్టు రాజకీయ అభిజ్ఞ వర్గాల బోగట్ట. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరాల్సిన అవసరం లేదన్నట్టు నల్లగొండ జిల్లా అంతా ఫుల్ ఫిల్ అయినట్టు వ్యాఖ్యానించడంతో గత కొంతకాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త వారి చేరికలకు బ్రేకు పడ్డట్టు అయింది గతంలో మాదిరిగా నియంతృత్వంగా బెదిరింపులకు గాండ్రింపులకు ప్రస్తుత ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలకు తావు లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తున్నట్లు అందుకే సీనియర్లను ఇతర నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ వీడినవారు బిజెపితో సహా ఇతర పార్టీలకు వెళ్లినవారు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటే కాంగ్రెస్ సీనియర్ల వైఖరితో కొంత వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది

సునీల్ కనుగోలు నివేదిక ఆధారమా

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి నాయకుల స్థితిగతులపై బలబలాలు అంచనాలపై బేరీజు వేసి సర్వే పరిశోధన ద్వారా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా టిపిసిసి ఏఐసిసి లు రంగంలోకి దిగి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆ క్రమంలోనే సీనియర్లు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించినట్టు సమాచారం. దీంతో పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డి దామోదర్ రెడ్డిలు పార్టీ మారడం లేదని ఖండించడం హైదరాబాద్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిమితం కావడం జానారెడ్డి కూడా ఎక్కువ మాట్లాడకపోవడం తదితర చర్యలు అన్నీ కూడా పార్టీ హై కమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరకేనని పార్టీ ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతా కలిసికట్టుగా ఉండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 సీట్లు గెలిచే విధంగా పార్టీ ఐ కమాండ్ తీసుకుని విధివిధానాలకు అనుకూలంగా జిల్లా నాయకులు కూడా వ్యవహరించాలి తప్ప సొంతంగా వ్యవహరించి అనవసరంగా మాట్లాడి పార్టీకి తలనొప్పులు తెచ్చి పార్టీ ప్రతిష్ట బజారున పడే విధంగా ప్రవర్తించవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్లను హెచ్చరించినట్లు తెలిసింది దీంతో సదరు సీనియర్లు గమ్ముగా ఉండి తమ పని చేసుకుంటూ ఇతర నియోజకవర్గంలో పని అనుకుంటూ పార్టీని ఎలా గెలిపించాలని చర్యలపై దృష్టి పెట్టినట్టు సమాచారం దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఎలా ఉంటుందో.. శ్రీనివాస్ రెడ్డి వారి నుంచి ఎవరు టికెట్లు ఆశిస్తున్నారో.

బీ ఆర్ఎస్ టికెట్లు ప్రకటించడంతో తమ పార్టీలోకి ఏ నియోజకవర్గాల్లోకి గెలుపు గుర్రాలను తీసుకోవాలో అనే ఆలోచనతో కాంగ్రెస్ నాయకులు ముందుకు పోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అనవసర కామెంట్లు సెటైర్లు తగ్గి అంతా ఐక్యమత్యంతో పార్టీ గెలిచే చర్యలపై ఆయా నాయకులు దృష్టి పెట్టినట్లు సమాచారం.