జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రస్మ జిల్లా అధ్యక్షులు జలంధర్ రెడ్డి

జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రస్మ జిల్లా అధ్యక్షులు జలంధర్ రెడ్డి

భువనగిరి ఆగస్టు 08 (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గాపదవి బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణారెడ్డిని  తెలంగాణ  రికగ్నైజేడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పగిడాల జలంధర్ రెడ్డి, మరియు జిల్లా కమిటీ సభ్యులు కలిసి వారికి  బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ని ట్రస్మా  జిల్లా అధ్యక్షులు పగిడాల జలంధర్ రెడ్డి ప్రైవేట్ పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలపడం జరిగింది. 

ఆ సమస్యలను కలెక్టర్ సానుకూలంగా స్పందించి   పరిష్కరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా  యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, కోశాధికారి నోముల బస్వరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తోటకూరి యాదయ్య, చిన్నం సురేష్ ,విద్యాసాగర్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.