యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

భువనగిరి ముద్ర న్యూస్:  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలోజిల్లా కలెక్టర్ పమేలా సత్పథి జ్యోతి వెలిగించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  ఎంపీపీ నరాల నిర్మల,  జడ్పీటీసీలు అనురాధ,  బీరు మల్లయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య,  కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరావు చారి,  జిల్లా కురుమ సంఘం  అధ్యక్షులు నరసింహ,  జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, ఎ.అశోక్,  వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.