ఎంపీ పోతుగంటి చూపు అచ్చంపేట అసెంబ్లీ వైపు

ఎంపీ పోతుగంటి చూపు అచ్చంపేట అసెంబ్లీ వైపు
  • ఎంపీ వద్దు.... ఎమ్మెల్యే ముద్దు...
  • తన మనసులో మాటను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ!?

ముద్ర నాగర్ కర్నూల్ జిల్లా :  నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు వచ్చే ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ వైపు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంటు సభ్యులుగా  ఉండి ఏమి సాధించలేము... ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాను అని ఎమ్మెల్యేగా ఉంటేనే ప్రజలకు చేరువై మరింత మెరుగైన ప్రజాసేవ చేయడానికి వీలు పడుతుందని నిరంతరం ప్రజల మధ్యన ఉండి పనిచేయడం ఆయనకు ఎంతో ఇష్టం అని తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ స్థానం నుండి అవకాశం కల్పించినట్లయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఎంపీ రాములు, ఆయన వర్గం నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారు. టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. పోతుగంటి రాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యులుగా ఉన్నారు.

నియోజకవర్గంలో పిలిస్తే పలికే మంచి పేరున్న రాములుగా అచ్చంపేట నియోజకవర్గం లో ఆయనకు ప్రతి గ్రామంలో అభిమానులు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.  దానిని సొత్తు చేసుకునేందుకుగాను వచ్చే ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అవకాశం కల్పించాలని అధిష్టానం దృష్టిలో తన మనసులో ఉన్న మాట పెట్టినట్లు సమాచారం.  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన  గెలుపొంది ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మూడోసారి హ్యాట్రిక్  సాధించి , వచ్చే మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆశతో ఉన్నారు.

 వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని విధాలుగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నారు.  ప్రజలు వచ్చే ఎన్నికలలో నాకే పట్టం కడతారని ధీమాతో  ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో హైదరాబాద్ పర్యటనలు తగ్గించుకొని , స్థానికంగా ప్రజల మధ్యన ఉండి పని చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల గత కొద్ది నెలలుగా  ఒక ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఎంపీ రాములు , ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య తీవ్ర ఫోను సంభాషణలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.

 ఇది రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  గువ్వల బాలరాజు అచ్చంపేట నా అడ్డ నా అడ్డాలో ఎవరు వచ్చిన నిలబడరని అధిష్టానం నాకే మూడోసారి అవకాశం ఇస్తుందని ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమాతో ముందుకు వెళుతున్నారు. అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఎంపీ మధ్యన ఉన్న రాజకీయ వైర్యంతో సొంత పార్టీలోనే పార్టీ క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం గువ్వల బాలరాజుకు అండగా ఉన్న నాయకులు అనిచరులు ముఖ్యమైన కార్యకర్తలు ఒకప్పుడు ఎంపీ రాములుకు అనుకూలంగా పనిచేసిన వారే... ఎమ్మెల్యే టిక్కె ట్ అవకాశం ఇస్తే గెలిచి తీరుతానని నాకు ప్రజల్లో నా స్థానం నాకు ఉందని అదే ధీమాతో ప్రజల ముందుకు వెళుతున్నానని పోతుగంటి రాములు.

తన సన్నిహితులకు, నాయకులకు కార్యకర్తలకు అంతర్గతంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఇటీవల పోతు గంటి రాములు అనుచరులు, గుండూరు గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. గువ్వల బాలరాజును అచ్చంపేట నుండి ఈ ఎన్నికల్లో ఏదో విధంగా పరాజయం పాలు చేసి ఇక్కడి నుంచి పంపించినట్లయితే నాకు తిరుగు ఉండదు ఆలోచన ధోరణితో  ఎంపీ రాములు ఉన్నట్లు సమాచారం. దానికి తోడు తన తనయుడైన పోతుగంటి భరత్ కల్వకుర్తి జడ్పిటిసి సభ్యులు గత కొన్ని రోజులుగా అచ్చంపేట నియోజకవర్గంలో నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని , ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడనే సాధించి తీరుతానని గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సుడిగాలి పర్యటనలు చేసి , ప్రజల మధ్యన నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ వచ్చారు.

అయితే గత మూడు నాలుగు నెలల నుండి భరత్ నియోజకవర్గంలో తిరగకుండా కనిపించకుండా పోవడంతో అసలు ఏం జరుగుతోంది  బిఆర్ లో అనే మీమాంస నెలకొని ఉంది...!  టిఆర్ఎస్ పార్టీలో అనే చర్చ జరుగుతోంది. అధిష్టానం ఎంపీ రాములు కు అచ్చంపేట అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్లు సమాచారం రావడంతోనే భరత్ ప్రసాద్ సున్నితంగా ఉంటున్నట్లు చర్చ జరుగుతుంది. వచ్చే రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికలలో అసలు అచ్చంపేట టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో అనే అయామయంలో అచ్చంపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అటు  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేక ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాముల ఎవరికి మద్దతు తెలిపితే ఏమి జరుగుతుందో అని బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది చివరకు  ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించకుండా ఉండడం కనిపిస్తోంది నియోజకవర్గం లో.