భారీగా మిగిలిన  ఇంజినీరింగ్ ​సీట్లు

భారీగా మిగిలిన  ఇంజినీరింగ్ ​సీట్లు

  • కన్వీనర్ కోటాలో 13,139 సీట్లు ఖాళీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో భర్తీ కాని ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. బుధవారం ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. కన్వీనర్ కోటాలో 70,627 సీట్లు భర్తీ చేయగా, ఇంకా 13,139 సీట్లు మిగిలిపోయాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంది. కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వెల్లడించారు. ఆగస్టు17న స్లాట్ బుక్కింగ్, 18న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, 17 నుంచి 19వ వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి, 23వ తేదీన సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు.