ప్లాస్టిక్ కల కల..భూమాత విల విల..

ప్లాస్టిక్ కల కల..భూమాత విల విల..

ఎన్.సి.సి  అధికారి గుండెల్లి రాజయ్య

 ముద్ర, మొగుళ్లపల్లి :ప్లాస్టిక్ నేడు కలకాల లాడుతూ..భూమాత విలవిలలాడుతూ..ఉందని "పరిసరాల పరిరక్షణ దినోత్సవం "సందర్భంగా పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ నంద కందూరి ఆదేశాల మేరకు మండలంలోని జడ్పీహెచ్ఎస్ మొట్లపల్లి పాఠశాల ఎన్.సి.సి అధికారి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్.సి.సి విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో విద్యార్థులు గ్రామంలోని వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ ను వాడకూడదని.. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలకు సంబంధించిన ప్లేకార్డులను చేతభూని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి నరసింహ స్వామి, గ్రామ సర్పంచ్  నరహరి పద్మ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నరహరి కల్పన,   ఉప సర్పంచ్ విష్ణు, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు  ఏ. సంపత్ కుమార్, బి. వీరయ్య, కే.రవీందర్, గ్రామ యువకులు మరియు ఎన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు.