ఎల్లేని హౌస్ అరెస్టు..!

ఎల్లేని హౌస్ అరెస్టు..!

ముద్ర,కొల్లాపూర్: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు కొల్లాపూర్ పర్యటన దృష్ట్యా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ ఎల్లేని సుధాకర్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్లేని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏ మీటింగ్ నిర్వహించాలన్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను నిర్భంధం చేస్తే గానీ సభలు, ప్రారంభోత్సవాలు నిర్వహించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కు సంబంధించి అవకతవకలను ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాలను బయటపెడతామని భయంతో నన్ను హౌస్ అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు.