బ్రేకింగ్ న్యూస్:- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్ - కార్యకర్తల ఆందోళన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: అచ్చంపేట మాజీ MLA గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు వెల్దండ పీఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు.