ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి...

ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి...
  • చొప్పదండిలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ

ముద్ర, చొప్పదండి:ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చొప్పదండిలో ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో ఆటోలలో ఎక్కే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆటోలు సరిగా నడవక మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందని వాపోయారు.లక్షల కుటుంబాలు ఆటోలు నడుపుతూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారని అలాంటి వారందరికీ తక్షణమే రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి తాహాసిల్దార్ కార్యాలయం వరకు ఆటోలతో భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన ర్యాలీ చేపట్టారు.అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తాసిల్దార్ వేముల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.