ఈ నెల 16 న నాగర్ కర్నూల్ కు  ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు..  

ఈ నెల 16 న నాగర్ కర్నూల్ కు  ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు..  

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపి అభ్యర్థి పోతుగంటి భరత్ కు మద్దతుగా ప్రధాని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సభ కోసం నెల్లికొండ చౌరస్తా, ఉయ్యాలవాడ ప్రాంతాల్లోని స్థలాలను జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, వనపర్తి జెడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీపాచారి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ... 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఎంపీ రాములు తనయుడు భరత్ బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో భరత్ ను గెలిపించుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోడీ సభతో బిజెపి గెలుపు ఖాయమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నాగర్‌కర్నూల్ లో 167-K జాతీయ రహదారి, సోమశిల- సిద్దేశ్వరం వంతెన పనులు జరుగుతున్నాయన్నారు. 

అలాగే...
భూత్పూర్ - శ్రీశైలం జాతీయ రహదారి, గద్వాల నుంచి సూర్యాపేట వరకు రైల్వే లైన్ సాధనకు ప్రధాని మోదీకి సభలో విన్నవిస్తామని ఆచారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ భంగపడిందన్నారు. 

దేశానికి మోడీ నాయకత్వం ఎంతో అవసరం ఉందని అన్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో,రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మోడీ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు రావాలని పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.పార్లమెంట్ పరిధిలోని అన్నినియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నారని తెలిపారు. .