ఎరుకల సమస్యలు పరిష్కరించాలని వినతి

ఎరుకల సమస్యలు పరిష్కరించాలని వినతి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- పెండింగ్లో ఉన్న ఎరుకల సమస్యలు పరిష్కరించాలని ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బంజారాహిల్స్ లో ఆయన నివాసంలో కలుసుకొని ఎరుకల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీము కింద 60 కోట్లు నిధులు మంజూరు చేయాలని, 138 పందుల సహకార సంఘాలకు ప్రభుత్వ భూములు కేటాయించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. గ్రూప్-1,2,3,4 లో ఉద్యోగాలు పొందేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ చైర్మన్ గా ఎరుకల సామాజిక వర్గానికి ఇవ్వాలన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మండలపురం గోపాల్, వనం రమేష్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు పాతంపల్లి నరసింహ, ఉపాధ్యక్షులు రుద్రాక్షి నరసింహ, రాయపురం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.