కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం

కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
  • బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆద్వర్యంలో తెల్కపల్లి మండలం, గట్టురాయిపాకుల గ్రామాన్ని సందర్శించారు. బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ నిన్న రాత్రి గట్టురాయిపాకుల గ్రామానికి తన ప్రచారంలో భాగంగా విచ్చేసిన, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిని బిఎస్పీ పార్టీ నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి మీ నాన్న బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. నాగర్ కర్నూలు ప్రజలకు, ముఖ్యంగా మా గ్రామ అభివృద్ధికి మీ నాన్నగారు ఏం చేశారు అనీ అడిగారు. దాంతో అక్కడే ఉన్న కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులైన పాపిరెడ్డి మరియు మిగిలిన వాళ్ళు, అడగడానికి మీరేవ్వరూ అంటూ బిఎస్పీ పార్టీ గ్రామ నాయకులపై విచక్షణ రహితంగా దాడులు చేశారని అన్నారు. బిఎస్పీ నాయకుల శరీరాలపై రక్తపు గాయాలు, రక్కిన గాయాలు ఉన్నాయని తెలిపారు. పార్టీ నాయకుల బట్టలు చింపి మరి కొట్టారని, మర్రికి - రాజేష్ రెడ్డికి పెద్ద తేడా ఏంలేదని ఎద్దేవా చేశారు. అధికారం రాక ముందే ఇలా ఉంటే, అధికారంలోకి వస్తే ప్రజలను బ్రతకనివ్వరేమో అనీ అన్నారు.

నాగర్ కర్నూలు అసెంబ్లీ పేద ప్రజలపై ఒకనాడు నాగం జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత దామోదర్ రెడ్డి, మధ్యలో మర్రి జనార్దన్ రెడ్డి, ఇప్పుడు రాజేష్ రెడ్డి తమ అనుచరులతో దాడులు చేయిస్తున్నారని మాట్లాడారు. పేదలపై ఇ దాడులు ఎప్పుడు ఆగుతాయని ప్రశ్నించారు. పేదలపై దాడులు చేయడానికే ఎమ్మేల్యే పదవులా అనీ దుయ్యబట్టారు. నూటికి 99శాతం ఉన్న బహుజన బిడ్డలు ఏకమైతే ఏ ఒక్క నాయకుడు కూడా గ్రామాల్లో తిరగలేరని స్పష్టం చేశారు. బిఎస్పీ పార్టీ నాయకులను రెచ్చగొడితే దాడులకు, ప్రతిదాడులు ఖచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు. త్వరలోనే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని, ఆ రోజు ఎవరి మీద దాడులు చేస్తారో, చంపుతారో చూస్తామని సవాల్ విసిరారు. భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తదనంతరం గ్రామం నుండి ర్యాలీగా తెల్కపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, మండల ఇంచార్జ్ భీంపాగ మల్లేష్, నాయకులు శ్రీహర్ష ముదిరాజ్, బాలనాగులు, విష్ణు, సైదులు, రాజేష్, శివ, మధు, ఉస్సేన్, సురేష్, బాబు, శేఖర్, మల్లేష్ లు పాల్గొన్నారు.