కళ్యాణ లక్ష్మీ - షాది ముబారక్ పథకం నిరుపేదలకు వరం..

కళ్యాణ లక్ష్మీ - షాది ముబారక్ పథకం నిరుపేదలకు వరం..
  • మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి..
  • నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంభందించి,వారికి మొత్తం 225 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ - షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...
  • నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంభందించిన 111 మంది లబ్దిదారులకు 65 లక్షల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...
  • అనంతరం వారితో కలిసి సహంపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా  కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరంతరం కొనసాగిస్తున్న కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సంబంధించి వారికి మొత్తం 225 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని,మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈరోజు  మొత్తం 225 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేయడం జరిగింది అని అన్నారు,111 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు,కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.

కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు.మహిళల రక్షణ కోసము షి టీమ్ గర్బిని స్త్రీ,చిన్నారుల ఆరోగ్య కోసము ఆరోగ్య లక్ష్మి  పథకం,బాలింతల చిన్నారుల కోసము కేసిఆర్ కీట్స్, నుట్రిషన్ కిట్స్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టారు అని అయన గుర్తు చేశారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.