బీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం..

బీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం..
  • ఛైర్మన్ పదవి కోసం పట్లు..
  • రెండు గ్రూపులుగా కౌన్సిలర్లు..
  • ఛైర్మన్ కోసం రూ. లక్షల్లో ఆఫర్లు..
  • మాజీ ఎమ్మెల్యే మర్రికి తలపోటు..
  • పార్టీ మారేందుకైనా సిద్ధంగా పలువురు...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికలలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకురావడం తెలిసిందే రాష్ట్రంలోని జిల్లాలలో మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్న సందర్భంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కుర్చీని దక్కించుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలోని కౌన్సిలర్లు కూడా రెండు వర్గాలుగా చీలి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గతంలో మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చిన బాదం సునీత కు ఇవ్వకపోవడం వల్ల ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అప్పటి ఎమ్మెల్యే వైఖరి పై బహిరంగంగానే విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రధాన అనుచరుడి  కి చిట్ట చివరకి చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇటీవల జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల ముందు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం గతంలో ఉన్న కౌన్సిలర్లు కూడా పార్టీ వీడకపోవడంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని ఊహాగానాలు వెలువడిన సందర్భంలో బాదం సునీత చైర్మన్ పదవి కోసం మళ్లీ పట్టుబడుతున్నట్లు ఆమె భర్త బాదం నరేందర్ మరి కొంతమంది కౌన్సిలర్లతో చర్చలు జరిపి మున్సిపల్ చైర్మన్ పదవిపై అప్పటి ఎమ్మెల్యే తో చర్చలు సాగించినట్లు తెలిసింది.

కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం బాదం సునీతకు మద్దతు పలుకుతుండడం తో పాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఇసాక్ ఫైస్ చైర్మన్ పోటీలో ఉన్నారు చైర్మన్ పదవి కోసం మోతీ కుమార్ తో  పాటు మరో కౌన్సిలర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఇసాక్ వైస్ చైర్మన్ పదవి కోసం కసరత్తు ప్రారంభించినట్లు ఇరువురు కూడా  సిండికేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కల్పనా భాస్కర్ గౌడ్ భర్త మరి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్లి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని గత రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో తెలిపినట్లు సమాచారం కానీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్న కౌన్సిలర్ తనను పదవి నుంచి దించితే ఆత్మహత్య చేసుకుంటానని మాజీ ఎమ్మెల్యే ముందు బహిరంగంగానే ప్రకటించడం పై నియోజకవర్గంలోని బిఆర్ఎస్ లో చర్చ సాగుతుంది కానీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం ఎవరు మున్సిపల్ చైర్మన్ అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించినట్లు తెలిసింది. బాదం సునీత భర్త తనకు అవకాశం కల్పించకపోతే ఐదు మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.