మర్రి అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

మర్రి అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి

హాజరైన ట్రస్ట్ డైరెక్టర్స్ మర్రి జమున రాణి, జక్క రఘునందన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: పేదల ఆకలి తీర్చడానికే రూ/- 5  మధ్యాహ్న భోజనం అందించడానికి మర్రి అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసినట్టు MJR ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో MJR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు రూపాయల భోజనం మర్రి అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ట్రస్ట్ డైరెక్టర్స్ మర్రి జమున రాణి, జక్కా రఘునందన్ రెడ్డి,BRS రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలల నుండి వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వస్తున్న పేదలు, వృద్దులకు ,తినడానికి డబ్బులు లేక అర్థకాలితో ఉన్న వారి ఆకలి తీర్చడానికి తన MJR చారిటబుల్ ట్రస్టు అధ్వర్యంలో మర్రన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు.

రూ/- 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం అందించనున్నట్టు తెలిపారు,రోజుకు 500 నుండి 1000 మంది ఆకలి తిర్చేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు,కేవలం 20-30 నిమిషాల్లో వంట అయ్యే విధంగా అత్యాధునిక కిచెన్ ఏర్పాటు చేశామన్నారు, ప్రతి రోజు అన్నం,కూర,చట్నీ, సాంబార్, పెరుగు అందజేయనున్నట్లు తెలిపారు, ఇవే కాకుండా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు సామూహిక వివాహాలతో సుమారు 800 మందినిరుపేద ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశామన్నారు.

నిరుద్యోగ యువతీ యువకులకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు, గత కొన్ని రోజుల కింద నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతీ యువకులకు ఉచితంగా ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నట్టే తెలిపారు, రాబోయే కాలంలో కూడా తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్,పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.