గిరిజనులను ఇంకెంత కాలం మోసగిస్తావు సీఎం

గిరిజనులను ఇంకెంత కాలం మోసగిస్తావు సీఎం

బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్పీ 

ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలో  నెల 31న జరగనున్న గిరిజన అలయ్ బలయ్ కార్యక్రమం విజయవంతం చేయాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇ రోజు బిఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ ఆధ్వర్యంలో, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గిరిజన అలయ్ బలయ్ గోడ పత్రికలు - కరపత్రాలు డా.ఆర్ఎస్పీ గారు విడుదల చేశారు. ఇ కార్యక్రమంలో డా.ఆర్ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలనలో గిరిజనుల బ్రతుకులు మారలేదని అన్నారు. గిరిజన బంధు ఇస్తానన్న సీఎం హామీ, నీటి మూటనే అనీ ఎద్దేవా చేశారు. తండాలను పంచాయతీలుగా ప్రకటించామని ఆర్బాటంగా చెప్తున్నప్పటికి, ఆ తండాలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాదని స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తాననడం, కేవలం ఎన్నికల స్టంట్ అనీ పేర్కొన్నారు.  రాష్ట్రములో బిఆర్ఎస్ - బీజేపీ లను గద్దెదింపి, బహుజనులు గద్దెనెక్కెందుకు బిఎస్పీ పార్టీకి ప్రజలు మద్దత్తూ ఇవ్వాలని కోరారు. అప్పుడే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయని చెప్పారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డా.వెంకటేష్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధులు డా.సాంబశివ గౌడ్, అరుణ క్వీన్, రాష్ట్ర కార్యదర్శి కదికంటి విజయ్, రాష్ట్ర కోశాధికారి ఎల్లన్న, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, బిఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఇంఛార్జ్ అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య, అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్, లాలుసాగర్ లు పాల్గొన్నారు.