ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం..
ముద్ర ప్రతినిధి : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం తన అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లోకి గృహప్రవేశం చేశారు. ఉదయం క్యాంప్ ఆఫీసులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ సరిత దంపతులు కలిసి క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టారు.