కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం సర్పంచ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం సర్పంచ్

ముద్ర.కొల్లాపూర్: చిన్నంబాయి మండలంలోని గూడెం గ్రామ సర్పంచ్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  మాజీ మంత్రి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పార్టీ కండువా కప్పి సర్పంచ్ చక్రవర్తిని పార్టీలోకి ఆహ్వానించారు, గడిచిన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక బ్రష్టు పట్టించారని, డబ్బులకు అమ్ముడుపోయే నాయకులతో అభివృద్ధి జరగవని గ్రహించి పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కార్యక్రమంలో చిన్నంబావి మండల నాయకులు చిదంబర్ రెడ్డి,కెఏంఆర్ ట్రస్ట్ ఛైర్మన్ కొత్త కళ్యాణ్ రావు,కొప్పునూరు సింగిల్ విండో డైరెక్టర్ సాగర్ రావు,నాయకులు వెంకటేష్, బిచ్చన్న,మహేష్  పాల్గొన్నారు.