ముద్ర దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నది..

ముద్ర దినపత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నది..
  • ముద్ర దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్సై నరేష్ కుమార్..

గొల్లపల్లి. ముద్ర :- అనధికాలంలోని ముద్ర దినపత్రిక ప్రజాభిమానాలు జరగవన్నదని గొల్లపల్లి ఎస్ ఐ నరేష్ కుమార్ అన్నారు.

గొల్లపల్లి మండల కేంద్రం లోబుధవారం ఎస్సై నరేష్ కుమార్ ముద్ర దినపత్రిక-2024నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్ర దిన పత్రిక ప్రజల అభిమానాన్ని ఆదరణను చురగొన్నదని ముద్ర పత్రిక యాజమాన్యాన్ని సిబ్బందిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు . ముద్ర దినపత్రిక పక్షపాత ధోరణి లేకుండా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అత్యంత వేగంగా వార్తలు అందించడంలో పతాక శీర్షికన నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు జంగిలి సత్యం, నరసాపురం రవీందర్, అంకం భూమయ్య, మద్దెల గోవర్ధన్, మద్దూరి నవీన్, అనిల్, పుప్పాల మైపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.