బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మండలాల వారిగా కుల సంఘం నాయకులతో విస్తృత సమావేశాలు....

బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మండలాల వారిగా  కుల సంఘం నాయకులతో విస్తృత సమావేశాలు....

బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి.....

   ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మండలాల వారిగా కుల సంఘాల నాయకులతో త్వరలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ సమావేశానికి అన్ని కుల సంఘాల నాయకులు తమ హక్కులను సాధించుకోవడానికి కృషి చేయాలని అన్నారు. బీసీ కులగణన జరపాలని. మేమెంతో మాకు అంత వాటా జనాభా దామాషా ప్రకారం విద్యా. ఉద్యోగ. ఆర్థిక. రాజకీయ రంగంలో వార్డు నెంబర్ నుంచి పార్లమెంటు దాకా బీసీలు అధికారంలో ఉండాలి అన్నారు.

ఇటీవల బీహార్ రాష్ట్రంలోబీసీ కుల గణన చేపడుతున్న నితీష్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు బ్రేకులు వేసింది. బీసీ కుల సంబంధ వివరాలను సేకరించడం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని. అది కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రక్రియ అంటూ నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన పిటిషనర్లు దాఖలు చేయడం వలన  పాట్నా హైకోర్టు కులగనని నిలిపి వేయాలని ఆదేశించడం విచారకరమన్నారు. చట్టసభల్లో పార్లమెంటు స్థాయిలో ఓబీసీల సీట్ల కేటాయింపుల్లో  ఎక్కువ శాతం ఎక్కువగా ఉంటుందని కొన్ని సామాజిక వర్గాలు అడ్డు పడుతున్నాయని అన్నారు. అందుకే ఓ బీసీ మేల్కో మీ హక్కులు సాధించుకో అన్ని మండలాల వారిగా బీసీ కుల సంఘం నాయకులు ఏకమై  తమకు రావాల్సిన హక్కులు  సాధించుకోవడానికి కృషి చేసే విధంగా పోరాడాలని నాగర్ కర్నూల్ జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ కన్వీనర్ డి.అరవింద్ చారి బీసీ కుల సంఘం నాయకులకు పిలుపునిచ్చారు.