ఇంటర్ ఉర్దూ మీడియం విద్యార్థుల ప్రతిభ

ఇంటర్ ఉర్దూ మీడియం విద్యార్థుల ప్రతిభ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఇంటర్ మిడియట్  ప్రభుత్వ కాలేజి లలో ఉర్దూ మీడియం బాలికలు మంచి మార్కులతో ప్రతిభను చాటారు. ప్రభుత్వ బాలుర జూనియార్ కళాశాల, నాగర్ కర్నూల్ ఉర్దూ మీడియం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సదా తంజీమ్ 884/1000, ప్రథమ సంవత్సరం లో హఫీజా అంజుం 436/500 మరియు ప్రభుత్వ జూనియార్ కళాశాల, కల్వకుర్తి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని తహ్మీన్ సుల్తానా 706/1000,  ప్రథమ సంవత్సరం లో హాఫ్సా 379/500 మార్కుల తో తమ ప్రతిభ ను చాటారు. 

ఈ సంద్భంగా జిల్లా ఇంటర్ మెడియెట్ నాగర్ కర్నూల్ నోడల్ అధికారి G. వెంకటరమణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియార్ కళాశాల, కల్వకుర్తి A. సురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రభుత్వ బాలుర జూనియార్ కళాశాల, నాగర్ కర్నూల్ G. మాధవి, ఉర్దూ మీడియం అధ్యాపకులు SK మహబూబ్ అలీ, జుబైరుద్దిన్ అహ్మద్, అమతుల్ దయ్యాన్ తస్కీన్, బాలరాజు అదితరులు ఉర్దూ మీడియం విద్యార్థిని లను అభినందించారు..