విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .గురువారం మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో 22 లక్షల వ్యయంతో నిర్మాణమైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్  విద్య విధానాన్ని మార్పు చేయడంలో భాగంగా అనేక గురుకుల పాఠశాలలు ప్రారంభించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూశారని అన్నారు .అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారనీ అన్నారు. అందులో భాగంగానే మన ఊరు మనబడి ప్రణాళిక ద్వారా పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు .ప్రభుత్వ పాఠశాలలో గతంలో కన్నా అన్ని రకాల వసతులు కల్పించామని అన్నారు .విద్యార్థులకు చక్కటి నాణ్యమైన భోజనం అందించిన ఘనత తమ ప్రభుత్వాన్నిదేనిని అన్నారు .

తుంగతుర్తి నియోజకవర్గం లో గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యం చేయబడ్డ పాఠశాలల వసతులు తరగతి గదుల కొరత లాంటి సమస్యలను దాదాపు పరిష్కరించామని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయ సహకారాలు పొందుతూ మంచి విద్యను అభ్యసించాలని అన్నారు .ఉపాధ్యాయులు ప్రభుత్వం అందించే ప్రతి సౌకర్యాన్ని ప్రతి విద్యార్థికి అందేలా కృషిచేసి నాణ్యమైన విద్య బోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, తహసిల్దార్ రాంప్రసాద్ ,ఎంఈఓ బోయినీ లింగయ్య ,ఎంపీడీవో భీమ్ సింగ్ ,ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ,డి ఈ ప్రభాకర్ ,ఏఈ రాంబాబు ,సర్పంచ్ మామిడి వెంకన్న, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం ,ఎంపీటీసీ కవిత ,గానుబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ,లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.