చెంచు ఓటర్ల సౌలభ్యం కోసం చెంచుపెంటలో 9 నూతన పోలింగ్ కేంద్రాలలు ఏర్పాటు - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ఉదయ్ కుమార్ 

చెంచు ఓటర్ల సౌలభ్యం కోసం చెంచుపెంటలో 9 నూతన పోలింగ్ కేంద్రాలలు ఏర్పాటు - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ఉదయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం లోని  చెంచుపెంటల్లోని చెంచుల ఓటర్ల సౌలభ్యం కోసం 9 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 

కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి పౌరుడు ఓటు హక్కును సౌలభ్యంగా సులభంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలనే నిబంధన మేరకు అమ్రాబాద్, లింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుపెంటల్లోని ఓటర్ల రవాణా దూరం తగ్గించాలని ఉద్దేశంతో చెంచుపెంటలో అనువైన మౌలిక వసతులు కల్పించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాంపూర్ పెంట అంగన్వాడి భవనంలో 213/A పోలింగ్ కేంద్రంలో 46 మంది ఓటర్లు,బౌరాపూర్ పెంట అటవీ శాఖ బేస్ క్యాంప్ 213/B పోలింగ్ కేంద్రంలో 26 మంది ఓటర్లు, ఈర్లపెంట ప్రైవేటు భవనం 213/C పోలింగ్ కేంద్రంలో75 మంది ఓటర్లు, అగర్లపెంట ప్రైవేటు భవనం213/D పోలింగ్ కేంద్రంలో15 మంది ఓటర్లు , పుల్లయపల్లి ఫారెస్ట్ బేస్ క్యాంప్ 213/E పోలింగ్ కేంద్రంలో 14 మంది ఓటర్లు, మేడిమల్కల ప్రైవేటు భవనం 213/F పోలింగ్ కేంద్రంలో 45 మంది ఓటర్లు, సంగడిగుండాల ప్రైవేటు భవనం213/G పోలింగ్ కేంద్రంలో 22 మంది ఓటర్లు, ఫర్హాబాద్ గేట్ ఫారెస్ట్ బేస్ క్యాంప్225/A పోలింగ్ కేంద్రం లో 10మంది ఓటర్లు,మల్లాపూర్ పెంట 225/B ప్రైవేట్ భవనం పోలింగ్ కేంద్రంలో 36 మంది ఓటర్, మొత్తం9 పోలింగ్ కేంద్రాల్లో 289 మంది ఓటర్లకు కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొత్తగా ఏర్పాటు చేసిన 9 పోలింగ్ కేంద్రాలకు 11 బ్యాలెట్ యూనిట్లు 11 కంట్రోల్ యూనిట్లు 13 వివి  ప్యాట్లను రాజకీయ పార్టీల సమక్షంలో శనివారం జిల్లా ఈవీఎం గోదాం నుండి ర్యాండామైజేషన్ నిర్వహించి అచ్చంపేట రిటర్నింగ్ అధికారి ఆధీనంలోని స్ట్రాంగ్ రూముకు తరలించామని కలెక్టర్ తెలిపారు.

ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో సీసీ కెమెరాలను బిగించడం జరిగిందని, పోలింగ్ ప్రక్రియను గుర్తిస్తాయిలో రికార్డ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.