గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె కు మద్దతుగా డాక్టర్ రాజేష్ రెడ్డి...

గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె కు మద్దతుగా డాక్టర్ రాజేష్ రెడ్డి...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ  రోజుకు చేరుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా  తెలకపల్లి మండలంలో నిర్వహించిన సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులకు యువ నేత కుచుకుల్ల రాజేష్ రెడ్డి మద్దతు తెలిపారు.  వారితో పాటు సమ్మెలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ కార్మికులు మరణిస్తే నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ఆక్రమంగా తొలగింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ప్రమాద బీమా కల్పించాలని గ్రాడ్యుటి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదివారం పండుగ సెలవులు జాతీయ ఆర్జిత సెలవు దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.  11వ పిఆర్సి ప్రకారం మినిమం బేసిక్ 19 వేల రూపాయలు చెల్లించాలని జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15,600 ఆపరేటర్స్ ఎలక్ట్రిషన్ డ్రైవర్లకు కారోబార్ బిల్ కలెక్టర్లకు 19 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.