స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం - జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ పి ఉదయ్ కుమార్

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం - జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ పి ఉదయ్ కుమార్
  • సోషల్ మీడియా పై పటిష్టనిగా - జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు : జిల్లా నూతన ఎస్పీ గా ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ గైక్వడ్ వైభవ్ రఘునాథ్, తొలిసారిగా  మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పలు  అంశాలపై వీరిద్దరూ చర్చించారు.జిల్లాలోని నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని 793 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వర్తించేలా చూడాలని నూతన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ను కలెక్టర్ ఉదయ్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....

శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యంత్రాంగానికి శిక్షణతోపాటు మొదటి విడత తనిఖీలు పూర్తిచేసి ఈవీఎంలను సంసిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలుచేయటంతోపాటు గతం కన్నా ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్సు, వీడియో ఫ్లయింగ్ స్క్వాడ్స్, నోడల్ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేస్తున్నామన్నారు.

జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ....

జిల్లాలోఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ విద్వేషాలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని, రాజకీయ సమావే శాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్‌ కేంద్రాలకు 100మీటర్ల పరిధిలో నిర్వహించరాదని పేర్కొన్నారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 123, ఐపీసీ సెక్షన్‌ 171ప్రకారం అభ్యర్థులపై 6 సంవత్స రాలు నిషేధం ఉంటుందన్నారు.  రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం సువిధ యాప్ ద్వారా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఒకేప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువమంది సమావేశాలు నిర్వ హణకు పోటీపడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వీవీఐ పీలు, వీఐపీల పర్యటన సమయంలో స్థానిక పోలీస్‌ అధికారులతో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు, ముఖ్య అతిథులకు ఇబ్బందులు కలగకుండా సమావేశాలు నిర్వహించుకో వాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను పెంచే విధంగా పోస్టులు పెట్టడం, ఇతరులను దూషించడం, బెదిరింపులకు గురిచే యడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాలో పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు.జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెక్పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.