నాలుగు కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జా

నాలుగు కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జా

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ కు వినతి పత్రం ఇచ్చారు.బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రమైన హౌసింగ్ బోర్డు కాలనీలో, దాదాపు 4కోట్ల విలువైన ప్రభుత్వ నాలా స్థలాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా, ఆ స్థలంలో మొదట వినాయక చవితి ఉత్సవాలు జరిపి - ఇప్పుడు ఏకంగా ఆ స్థలాన్నే బిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేసుకున్నారని విమర్శించారు.

కబ్జా చేసుకున్న స్థలంలో బిల్డింగ్ నిర్మించు కునేందుకు పుటింగులు పోసి, పిల్లర్ గుంతలు తవ్వారని తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మర్రి తక్షణమే స్పందించి,  ప్రభుత్వ నాలా స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ భూమి మొత్తం కబ్జాలకు గురి అవుతుందని ఆవేదన వెలి బుచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ నాలా స్థలాన్ని కాపాడాలని జేసీ మోతిలాల్ ను కోరారు... కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్ పాల్గొన్నారు.